శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 3 జనవరి 2019 (15:25 IST)

ఉప్పు లేకుండా.. ఆలివ్ ఆయిల్‌తో చేప ఫ్రై చేసిన ఉపాసన.. చెర్రీ కోసం..

డైట్ ఫాలో చేయడంలో చెర్రీ సతీమణి ఉపాసన ముందుంటుంది. తన భర్త ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకునే ఈ ముద్దుగుమ్మ.. వినయ విధేయ రామ సినిమా లొకేషన్‌లో చెర్రీ కోసం ఫిష్ ఫ్రై చేసి అదరగొట్టింది. అదీ గ్రిల్డ్ చేప ఫ్రైతో చెర్రీ నో కొలెస్ట్రాల్ ఫుడ్ అందించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే ఉపాసన ఈ చేపల ఫ్రైకి సంబంధించిన వీడియోను కూడా నెట్టింట పోస్టు చేసింది. 
 
లొకేషన్ పక్కనున్న కాలువ నుంచి పట్టుకొచ్చిన చేపకు ఉప్పును వాడకుండా... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో ఉపాసన ఫ్రై చేశారు. ఈ వంటకం తయారీలో ఉపాసనకు చరణ్ కూడా సాయం అందించాడు. ఆ తర్వాత ఫిష్‌కు తోడుగా బంగాళాదుంప, వెల్లుల్లిలను ఆమె జత చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.