నోటికి రుచిగా.. వడు మాంగా.. ఎలా చేయాలి..?

Last Updated: గురువారం, 28 ఫిబ్రవరి 2019 (10:28 IST)
వేసవికాలం వచ్చేసింది.. ఓ పక్క వేడి మరో మామిడి. కాయలు పెద్దవయ్యేలోపు రాలిన పిందెలతో కొన్ని.. కాయ పదునుకొచ్చాక మరికొన్ని చేసేయొద్దూ.. పిందే కదా అని చులకనగా చూడొద్దు. అందులోనూ రుచి ఉంది. మరి ఆ రుచి ఏంటో చూద్దాం..

కావలసిన పదార్థాలు:
మామిడి పిందెలు - 2 కప్పులు
ఉప్పు - తగినంత
నువ్వుల నూనె - 2 స్పూన్స్
ఎండుమిర్చి - 20
మెంతులు - అరస్పూన్
ఆవాలు - ముప్పావు స్పూన్
పసుపు - కొద్దిగా
ఇంగువ - పావుస్పూన్

తయారీ విధానం:
ముందుగా మామిడి పిందెలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, కాసేపు నీడలో ఆరబెట్టాలి. ఇప్పుడు ఓ పాత్రలో ఆరిన మామిడి పిందెలు వేసి వాటి మీద నూనె వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేసి కాగిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఆపై మరిగించి చల్లార్చిన పావుకప్పు నీళ్లు జతచేసి పొడిని మెత్తటి ముద్దలా అయ్యేలా చేయాలి. ఈ మిశ్రమాన్ని మామిడి పిందెల మీద పోసి కిందకి పైకి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడు నాలుగు రోజుల పాటు అలానే ఉంచాలి. అంతే మామిడి పిందెలు మెత్తగా అయ్యి వడు మాంగా తినడానికి రెడీ.దీనిపై మరింత చదవండి :