శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (14:20 IST)

కర్జూరం హల్వా తయారీ విధానం..?

కావలసిన పదార్థాలు:
గింజలు తీసిన కర్జూరాలు - పావుకిలో
పాలు - 50 గ్రా
చక్కెర - 40 గ్రా
నెయ్యి - 50 గ్రా
జీడిపప్పు - 10 గ్రా
పిస్తాపప్పు - 10 గ్రా
 
తయారీ విధానం:
ముందుగా దళసరి అడుగున్న పాత్రలో పాలు వేడిచేసి అందులో కర్జూరాలను, చక్కెర వేసి గరిటతో బాగా తిప్పూతూ నెయ్యి కూడా వేసి అడుగంటకుండా చూడాలి. ఇప్పుడు సగం జీడిపప్పుని జతచేయాలి. సన్నని మంటపైన ఉంచాలి. హల్వా బాగా చిక్కబడ్డాక, దించి మిగిలిన జీడిపప్పు, పిస్తా పప్పులతో అలంకరించుకోవాలి. అంతే... కర్జూర హల్వా రెడీ.