గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (14:08 IST)

గసాలతో హల్వా.. ఎలా చేయాలో తెలుసా..?

కావలసిన పదార్థాలు: 
గసాలు - 100 గ్రా
పాలు - 2 కప్పులు
చక్కెర - 100 గ్రా
జీడిపప్పు - 50 గ్రా
కిస్‌మిస్ - 50 గ్రా
నెయ్యి - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా గసాలను గంటపాటు పాలలో నానబెట్టాలి. ఆపై నానిన గసాలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని బాణలిలో వేసి మరిగించాలి. అందులో నెయ్యి, చక్కెర వేసి కలుపుకోవాలి. హల్వా బాగా దగ్గరపడేవరకు ఉడికించాలి. చివరగా జీడిపప్పు, కిస్‌మిస్ వేసి తీసుకుంటే.. టేస్టీ టేస్టీ గసాల హల్వా రెడీ.