శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (10:39 IST)

నేను ఎవ్వరితో పడుకోను.. నాకూ భార్య వుంది.. కర్ణాటక స్పీకర్ రమేష్

కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్ కేఆర్ రమేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనం సృష్టించాయి. సీనియర్ కాంగ్రెస్ నేత కేహెచ్ మునియప్ప చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గత ఫిబ్రవరి 15న శ్రీనివాస్‌పూర్ తాలుకాలోని ఓ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా మునియప్ప కేఆర్ రమేశ్‌పై పలు ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు. 
 
తానూ, రమేశ్ భార్యాభర్తల లాంటివారిమని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. నెల క్రితం మునియప్ప చేసిన ఈ కామెంట్స్‌పై కేఆర్ రమేశ్ తాజాగా అసెంబ్లీ సభలోనే స్పందించారు. తాను పురుషులతో కలిసి పడుకోనన్నారు. పురుషులతోనే కాదు.. ఎవరితోనూ పడుకోనని కేఆర్ రమేష్ స్పష్టం చేశారు.
 
తనకో భార్య ఉంది.. ఆమెతో వివాహమై దశాబ్దాలు గడుస్తోంది. మునియప్పకు తనతో పడుకోవాలని ఆసక్తిగా ఉందేమో.. కానీ తనకు లేదు. ఎవరితోనూ వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలన్న ఆలోచన కూడా తనకు లేదన్నారు. ప్రస్తుతం స్పీకర్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి. షేర్లు, లైక్లతో నెట్టింట ఈ వార్త వైరల్ అవుతోంది.