బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (15:34 IST)

బ్యూటీగా ఉండాలంటే...?

ప్రతివారు అందంగా కనిపించాలని తాపత్రయ పడుతుంటారు. అందంగా వుండాలని కోరికవుంటే సరిపోదు. అందానికి అవసరమైన ఆచరించదగిన సూత్రాలను కచ్చితంగా పాటించాలి. అందంగా కనిపించాలనుకుంటే నిద్ర విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవాలి. పగలు ఎక్కువగా నిద్రించకూడదు. గృహిణులు అరగంట నిద్రపోతే అలసట పోయి ఫ్రెష్‌గా కనిపిస్తారు. 
 
వయసును బట్టి ఫేస్‌ప్యాక్ ఉపయోగించడం అలవాటు చేసుకోండి. తలస్నానం చేయడానికి ముందుగా ఆయిల్‌తో బాగా మసాజ్ చేసుకోవాలి లేదా నిమ్మరసం పెరుగు శెనగపిండి కలిపి శరీరానికి మర్దన చేసి స్నానం చేయండి. అందానికి అదనపు పాయింట్ కేశ సౌందర్యం. అందుచేత గోరువెచ్చని నూనెను తలకు పట్టించి వేడినీటిలో ముంచి తీసిన టవల్‌ను నెత్తికి చుట్టుకోవాలి. ఇలా చేసినట్లైతే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. 
 
అందానికి మరింత అందాన్నిచ్చేవి దుస్తులు. మీ శరీర లావణ్యం ఎత్తు లావును బట్టి అందరికీ నచ్చే డ్రెస్‌ను ఎంపిక చేసుకోండి. ఇక అందానికి నవ్వు వెలకట్టలేని ఆభరణం, కోపం వదిలేసి అందరితో కలిసిపోయేలా చిరునవ్వుతో ఎదుటివారిని పలకరించాలి. ఇలాచేస్తే మీరు ఇతరులకు అందంగా కనిపిస్తారు.