గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By మోహన్
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (14:24 IST)

వుమెన్స్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ ప్రేమ పాఠాలు చెప్తున్నాడు.. వీడియో

కూడికలు, తీసివేతలు చెప్పే మ్యాథ్స్ లెక్చరర్ ఒక్కసారిగా ప్రేమ పాఠాలు చెప్పాడు. సాధారణంగా మ్యాథ్స్‌లో కూడికలు, తీసివేతలు, ఫార్ములాలు ఉంటాయి. అయితే సదరు లెక్చరర్ మాత్రం వాటికి తన క్రియేటివిటీ కాస్త జోడించి ప్రేమ పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. హర్యానాలోని కర్నాల్‌లో ఉన్న వుమెన్స్ కాలేజ్‌లో చరణ్ సింగ్ అనే మ్యాథ్స్ లెక్చరర్ ప్రేమ ఫార్ములాలు బ్లాక్‌బోర్డుపై చెబుతూ అడ్డంగా బుక్కయ్యాడు. 
 
అతని ప్రేమ పాఠాలను ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ కెమెరాలో చిత్రీకరించి ప్రిన్సిపల్‌కు చూపించింది. దాంతో షాకైన ప్రిన్సిపాల్ ఈ లవ్‌గురుని సస్పెండ్ చేసి పారేశారు. నిజంగానే ఏదో మ్యాథ్స్ ఫార్ములా చెబుతున్నట్లుగా అతడు ఎంతో సీరియస్‌గా ఈ ప్రేమ ఫార్ములాలు చెబుతుంటే.. స్టూడెంట్స్ అందరూ నవ్వడం ఈ వీడియోలో చూడొచ్చు.