భార్య దూరమైంది.. ప్రియురాలి హ్యాండిచ్చింది.. ఏకాకి అయిన 'లవ్ గురు'
అప్పటికే వివాహమై భార్య ఉంది. కానీ, ఆ ఉపాధ్యాయుడికి తన విద్యార్థినిపై మనసుపడింది. ఆమెకు మంచి మార్కులు వేస్తానని చెప్పి లోబరుచుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో సహజీవనం చేయసాగాడు.
అప్పటికే వివాహమై భార్య ఉంది. కానీ, ఆ ఉపాధ్యాయుడికి తన విద్యార్థినిపై మనసుపడింది. ఆమెకు మంచి మార్కులు వేస్తానని చెప్పి లోబరుచుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో సహజీవనం చేయసాగాడు. ఈ విషయం భార్యకు తెలిసి మీడియాకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించింది. ఆ తర్వాత భర్త నుంచి విడిపోయింది. పిమ్మట కొన్నేళ్ల కాపురం తర్వాత ప్రేమించి పెళ్ళి చేసుకున్న ప్రియురాలు ఆధ్యాత్మిక బాటలోకి వెళ్లింది. దీంతో ఆ ఉపాధ్యాయుడు ఏకాకి అయ్యాడు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ లవ్ గురు స్టోరీని పరిశీలిస్తే..
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా విశ్వవిద్యాలయానికి చెందిన మాతుక్ నాథ్ చౌదరి (64) ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. తన భర్త మాతుక్ నాథ్ జవహర్ లాల్ యూనివర్శిటీ విద్యార్థిని జూలీకుమారితో సహజీవనం చేస్తున్నాడని అతని భార్య 2006లో టీవీ జర్నలిస్టును ఇంటికి తీసుకువచ్చి అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. అనంతరం భర్తను తన ఇంటి నుంచి బయటకు గెంటేసింది. అధిక మార్కులేస్తానని విద్యార్థినులను ప్రొఫెసరు లొంగదీసుకున్నాడని ఆరోపణలు రావడంతో ఈ సంఘటన నాడు సంచలనం రేపింది.
విద్యార్థినితో ప్రేమలో పడిన ప్రొఫెసరు తాను సహజీవనం చేస్తున్నట్లు అంగీకరించారు. దీంతో బీహార్ 'లవ్ గురు'గా ప్రొఫెసరు వార్తల్లోకెక్కాడు. గతంలో నెలకు రూ.25వేల చొప్పున భార్యకు ప్రొఫెసర్ మెయిన్‌టనెన్స్ బకాయిలతో చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రొఫెసర్ మాతుక్ నాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో తన జీతం లేదా పెన్షన్ నుంచి మూడోవంతు భార్యకు చెల్లించడానికి అంగీకరించడంతో లవ్ గురు ప్రొఫెసరుకు, అతని భార్యకు మధ్య రాజుకున్న వివాదం ఇటీవలే సమసిపోయింది.
ఈ వివాదం సమసిన వెంటనే పడచు భార్య అయిన విద్యార్థిని జులీ కుమారి తన గురువైన భర్తను వదిలి ఆథ్యాత్మిక బాటలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. తన ప్రియురాలైన జులీ ఆథ్యాత్మిక జీవితం గడుపుతూ పుదుచ్చేరి, రిషికేష్, పూణేలోని ఓషో ఆశ్రమాల్లో గడుపుతోందని లవ్ గురు మాటుక్ నాథ్ చౌదరి చెప్పాడు. అటు భార్య దూరమై... ప్రియురాలు వదిలి వెళ్లడంతో తాను ఒంటరిగా మిగిలానని మాటుక్ నాథ్ వాపోయాడు.