సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: సోమవారం, 18 మార్చి 2019 (16:06 IST)

వివేకా మృతి విషయం తెలిసి 'పరవశించాం'.. నారా లోకేష్ నాలుక స్లిప్

‘‘పాపం వివేకానందరెడ్డి గారు చనిపోయారు.. పరవశించాం. ఎవరు చేశారో తెలియదు గానీ చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నారు. హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడుకు తెలుసా తల్లి'' అంటూ మాట్లాడింది మరెవరో కాదు... ఏపీ మంత్రి, సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్. 
 
ఒకవైపు వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య జరిగిందంటూ రిపోర్ట్ తేటతెల్లం చేసిన నేపధ్యంలో నారా లోకేష్ ఇలా వివేకా మృతితో పరవశించాం అంటూ చెప్పడంపై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. నారా లోకేష్‌కు కాస్త తెలుగు ట్యూషన్ పెట్టిస్తే బావుణ్ణు అంటూ సెటైర్లు వేస్తున్నారు. గతంలో కూడా లోకేష్ చాలాసార్లు తడబాటు పడిన సందర్భాలున్నాయి. ఎన్నికల వేళ ఆదివారం నాడు నారా లోకేష్ ఇలా వ్యాఖ్యానించడంతో ఇప్పుడు దానిపై విపరీతంగా కామెంట్లు పడుతున్నాయి.