బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 17 మార్చి 2019 (11:08 IST)

ఏపీలో దమ్మున్న మగాడు పవన్ ఒక్కడే : విజయశాంతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమ్మున్న మగాడు ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడేనని కాంగ్రెస్ మహిళా నేత, సినీ నటి విజయశాంతి అన్నారు. రాజమండ్రిలో జరిగిన సభలో సీఎం కేసీఆర్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలు కోట్లాదిమంది ఆంధ్రుల హృదయవేదనగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, బీజేపీకి బినామీగా మారి ఏపీలో అడుగుపెట్టాలని చూస్తున్న కేసీఆర్‌ను సీమాంధ్రులు ఎప్పటికీ అంగీకరించరన్నారు. ఇన్నాళ్లు కేసీఆర్‌కు సీమాంధ్రలో సరైన ప్రత్యర్థి లేరని చెప్పుకునేవాళ్లని, కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ రూపంలో సరైనోడు వచ్చాడన్నారు. 
 
కేసీఆర్ ఒంటెద్దు పోకడలను, నియంత ధోరణులను ప్రశ్నించడం ద్వారా తానేంటో నిరూపించుకున్నాడని పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ జోక్యం ఏంటని పవన్ నిలదీసిన వైనం ప్రతి ఒక్క ఆంధ్రుడి గుండెచప్పుడుగా భావించాలని విజయశాంతి అభిప్రాయపడ్డారు.