పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్... దక్షిణాది నుంచి బరిలోకి రాహుల్ గాంధీ?

Rahul Gandhi-pawan
కుమార్ దళవాయి| Last Modified శుక్రవారం, 15 మార్చి 2019 (20:02 IST)
ఉత్తరాది నాయకులకు దక్షిణాది అంటే చిన్నచూపు అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శిస్తున్న నేపధ్యంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ దక్షిణాది నుంచి కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ నుంచి మాత్రమే పోటీ చేసారు. అయితే కాంగ్రెస్ అంటే కేవలం ఉత్తరాది వారికి మాత్రమే అనే భావనను పోగొట్టేందుకు ఆయన దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రతిసారీ పోటీచేసే ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు కర్ణాటక నుంచి కూడా పోటీ చేస్తారని సమాచారం.

దక్షిణ భారతదేశానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడి నుండి పోటీ చేయాలనే డిమాండ్లు చేస్తుండటంతో వారి అభిమతానికి తగ్గట్లుగా అందరినీ కలుపుకుపోయే ధోరణిలో రాహుల్ కర్ణాటక నుండి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ వార్తకు బలం చేకూర్చే విధంగా రాహుల్ తన ఎన్నికల ప్రచారాన్ని దక్షిణ భారతదేశం నుండే ప్రారంభించడం విశేషం.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పట్టుండే ఒక కీలక ప్రాంతం నుండి రాహుల్ పోటీ చేస్తారనే వార్తలు జోరందుకున్నాయి. అయితే ఈ వార్తలు ఎంతవరకు వాస్తవమనే విషయం అధికారిక ప్రకటన వెలువడే వరకు తెలియదు.దీనిపై మరింత చదవండి :