బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (12:10 IST)

విమర్శలకు స్పందించి 15 లక్షల వీడియోలు తొలగించిన ఫేస్‌బుక్

న్యూజిలాండ్‌లో రెండు మసీదుల్లో జరిగిన కాల్పులు ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కావడంతో ఫేస్‌బుక్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.


ఈ విమర్శలకు స్పందించిన ఫేస్‌బుక్ చర్యలకు ఉపక్రమించింది. ఫేస్‌బుక్‌లో వైరల్ అయిన మారణకాండ వీడియోలపై ఫేస్‌బుక్ చర్య తీసుకోకపోవడాన్ని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.
 
ఫేస్‌బుక్‌పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ మారణకాండకు సంబంధించిన వీడియోలను తొలగించే పనిని చేపట్టింది. మారణకాండకు సంబంధించి ఫేస్‌బుక్‌లో ప్రచారంలో ఉన్న దాదాపు 15 లక్షల వీడియోలను తొలగించింది. అలాగే అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నించిన మరో 12 లక్షల వీడియోలను అప్‌లోడ్ కాకుండా అడ్డుకుంది.

మరోవైపు న్యూజిలాండ్ కాల్పుల ప్రత్యక్ష ప్రసారాన్ని నిరసిస్తూ ఎయిర్ ఏషియా గ్రూప్ సిఈఓ టోనీ ఫెర్నాండెజ్ తన ఫేస్‌బుక్ ఖాతాను స్తంభింపజేసారు. ఆయనకు 6.7 లక్షల మంది ఫాలోవర్లు ఉండటంతో ఆ ప్రభావం ఫేస్‌బుక్‌పై పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.