సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (16:07 IST)

మెడభాగం నల్లగా ఉందా..?

అందంగా, మృదువుగా కనిపించే మెడభాగాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మెడమీది చర్మం సున్నితంగా ఉంటుంది.. కాబట్టి మృదువుగా శుభ్రం చేయాలి. జుట్టు నుండి మెడకు అంటుకునే జిడ్డును తొలగించేందుకు స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
 
ఎండల్లో తిరిగినప్పుడు ఇంటికి రాగానే వేన్నీళ్లతో మెడను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని టవల్‌తో తుడుచుకోవాలి. కవరింగ్ నగలు ధరించటంవలన నల్లని మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మచ్చలు కారణంగా చర్మదురదలు కూడా వస్తాయి. కాబట్టి కవరింగ్ నగలను ధరించకపోవడమే ఉత్తమం.
 
మెడభాగానికి ఆలివ్ నూనె రాసి మసాజ్ చేయడం వలన ఆ ప్రాంతమంతా నున్నగా, మృదువుగా ఉంటుంది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా ఆలివ్ నూనెను రాసుకుని ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
రోజుకు కనీసం రెండుసార్లు 5 నిమిషాలపాటు మెడను పైకి ఎత్తడం, వంచడం, అటూ ఇటూ తిప్పడం చేయాలి. ఇలా చేయడం వలన మెడ కండరాలు చక్కగా పనిచేస్తాయి. కొద్దిగా గ్లిజరిన్‌ తీసుకుని అందులో కొన్ని నిమ్మరసం చుక్కలు కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట పడుకునేటపుడు మెడకు రాసి, ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే కొద్దిరోజుల్లోనే మెడ మెరిసిపోతుంది.