గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (12:36 IST)

డీ-గ్లామరస్ రోల్ : ఢిల్లీ యాసిడ్ దాడి బాధితురాలిగా దీపికా పదుకొనే

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే డీగ్లామరస్ రోల్‌లో కనిపించనున్నారు. ఈమె బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత గత యేడాది కాలంగా వెండితెరకు దూరంగా ఉంది. ఇపుడు డీ-గ్లామరస్ రోల్‌లో నటించనుంది. 
 
ప్రస్తుత ఆమె నటిస్తున్న తాజా చిత్రం "చపాక్". ఇందులో ఢిల్లీ యాసిడ్ దాడికి గురైన అమ్మాయి లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపికా పదుకొనే కనిపించనుంది. ఈ చిత్రంలోని దీపికా ఫస్ట్ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. యాసిడ్ బాధితురాలిగా తన లుక్‌ను దీపికా ట్వీట్ చేశారు. 
 
ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'రాజి' ఫేమ్ మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన 'పద్మావత్' చిత్రంలో దీపికా నటించింది. ఆ తర్వాత ఆమె మరో చిత్రంలో నటించలేదు. పెళ్లి చేసుకుని గత యేడాదికాలంగా ఇంటికే పరిమితమైంది. ఇపుడు 'చపాక్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
కాగా, 2005లో యాసిడ్ దాడి కార‌ణంగా బాధింప‌బ‌డి, యాసిడ్ దాడులకు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తూ ప‌లు అవార్డులు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ అందుకున్నారు. ఇప్పుడు ఆమె పాత్ర‌లో దీపికా న‌టించ‌టం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.