ప్రేమ పేరుతో వాడుకుని వదిలేస్తావా.. డాక్టర్‌పై నర్సు యాసిడ్ దాడి

Last Updated: గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:34 IST)
ప్రేమ పేరుతో ఓ నర్సును ఒక వైద్యుడు మోసం చేశాడు. దీంతో ఆ నర్సు అపర భద్రకాళిగా మారిపోయింది. ప్రేమ పేరుతో మోసం చేసిన వైద్యుడుపై ఆమె యాసిడ్ దాడి చేసింది. కోర్టు ప్రాంగణంలోనే ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ఆదర్శ్ రెడ్డి అనే వ్యక్తి వైద్యుడుగా పని చేస్తున్నాడు. ఈయనకు మొదట పెళ్లి జరిగింది. ఆ తర్వాత విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మరో మహిళతో సంబంధం ఉంది. ఈ క్రమంలో తాను పని చేసే ఆస్పత్రిలో ఓ నర్సును ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు.

చివరకు ఆదర్శ్ రెడ్డి బండారం బయటపడటంతో ఆ నర్సు ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ క్రమంలో ఆదర్శ్ రెడ్డి కోర్టుకు రాగా, అతనిపై యాసిడ్‌తో దాడి చేసింది. ఈ దాడిలో స్వల్ప గాయాలతో ఆదర్శ్ రెడ్డి తప్పించుకున్నాడు. యాసిడ్‌ దాడికి పాల్పడ్డ మహిళను తిరుపతి పశ్చిమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దీనిపై మరింత చదవండి :