గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (11:40 IST)

క్యాన్సర్ పేషెంట్ల పడకపై నిద్రించిన వైద్యురాలు.. మద్యం తాగి?

కెనడాలో ఓ మహిళా వైద్యురాలు ఓవరాక్షన్ చేసింది. మద్యం సేవించి.. ఆస్పత్రికి వచ్చిన ఆ డాక్టర్.. క్యాన్సర్ పేషెంట్‌ను నోటికి వచ్చినట్లు మాట్లాడింది. అంతేగాకుండా తాగిన మైకంలో ఆ పేషెంట్ పడకను పంచుకుంది. అతని పక్కనే పడుకుని నానా ఇబ్బందులకు గురిచేసింది. ఈ ఘటన కెనడాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కెనడాకు చెందిన దీప అనే వైద్యురాలు.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో క్యాన్సర్ పేషెంట్లకు వైద్యం అందిస్తోంది. ఈ నేపథ్యంలో దీప మద్యం సేవించి.. క్యాన్సర్ పేషెంట్ల వద్ద నోటికొచ్చినట్లు దుర్భాషలాడింది. వారి పడకలో నిద్రించి హద్దు మీరి ప్రవర్తించింది. దీంతో మనస్తాపానికి గురైన పేషెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఈ ఘటన జరిగి మూడు సంవత్సరాలైంది. పోలీసుల విచారణలో ఇప్పుడే దీప పేషెంట్ల వద్ద హద్దుమీరిందని తెలియవచ్చింది. దీంతో దీప లైసెన్స్‌ను కోర్టు రద్దు చేసింది. ఇంకా దీపకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.