గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 2 ఫిబ్రవరి 2019 (18:48 IST)

జనసైన్యాన్ని నడిపేందుకు 300 మంది మహిళలు... పవన్ కల్యాణ్ లిస్ట్

జనసేన ఆర్గనైజేషన్ పనిలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్‌. పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నారాయన. జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కొంతమంది పేర్లను పవన్ కళ్యాణ్‌ గుర్తించి మహిళలకు కీలక పదవులు ఇచ్చారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తే పార్టీ కూడా పటిష్టమవుతుందన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా మహిళలకు బలమైన స్థానాలు ఇచ్చారు పవన్. పార్టీ పటిష్టతకు అలుపెరగని పోరాటం చేస్తున్న 200 నుంచి 300 మంది పేర్లను తొలి జాబితా విడుదల చేశారు. ఎపిలోని 13 జిల్లాలకు చెందిన మహిళలు ఈ జాబితాలో ఉన్నారు. 
 
ఫిబ్రవరి రెండవ వారంలో విజయవాడలో పార్టీ పదవులు కేటాయించిన వారికి బాధ్యతలను స్వయంగా అప్పజెప్పనున్నారు పవన్ కళ్యాణ్‌. ఎన్నికలు సమీపిస్తున్నవేళ మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం.. ప్రచారానికి మహిళలనే పంపాలన్న పవన్ కళ్యాణ్‌ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది.