సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (12:44 IST)

చలికి.. ఊలు దుస్తులకు లింక్ ఏంటి..?

చలికాలం వలన బయట అడుగుపెట్టాలంటే చలి పులిలా వెంటాడుతుంటుంది. అలాగని పనులు మానుకోలేం కదా. చలి నుంచి తప్పించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కోవిధమైన వస్త్రాలను ఎన్నుకుంటారు. స్త్రీలు తాము వింటర్‌లో ధరించే దుస్తులలో కూడా వెరైటీని కోరుకుంటుంటారు. 
 
మార్కెట్‌లోకి వచ్చిన వింటర్‌ కలెక్షన్‌లను ఫాలో అవుతుంటారు. అయితే ప్రస్తుతం మనం ఎప్పటినుంచో చలికాలంలో ధరించే ఉన్ని దుస్తులపై యువత ఆసక్తి కనబరుస్తోంది. చేతితో నేసిన ఊలు దుస్తులపై మక్కువ పెంచుకుంటున్నారు. దాంతో వాటిల్లోనూ అనేక మోడల్స్, డిజైన్లు మార్కెట్లో కొలువుతీరాయి. 
 
పొడవైన కోటు, క్యాప్స్‌, స్కర్ట్స్, హ్యాండ్‌ గ్లౌజెస్‌, ఊలు మఫ్లర్‌, జాకెట్స్‌ ఇలా విభిన్న రకాలలో లభిస్తుంటాయి. తయారీ దారులు కూడా యువత అభిరుచులను దృష్టిలో ఉంచుకొని అమ్మాయిలు, అబ్బాయిలకు వేరు వేరు డిజైన్లలో ఉన్ని దుస్తులను రూపొందిస్తున్నారు. ఇలాంటివి ధరించి చలి నుంచి తమను తాము కాపాడుకోండి.