గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (14:10 IST)

బ్యాంకులో స్పైడర్ మ్యాన్... బిత్తరపోయిన సహోద్యోగులు... (Watch Video)

spider man
సాధారణంగా చాలా మంది సినిమాల్లో స్పైడర్ మ్యాన్‌ను చూసివుంటారు. కానీ, అదే స్పైడర్ మ్యాన్ ప్రత్యక్షంగా కనుల ముందు కనిపిస్తే.. ఇంకేముంది.. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. బ్రెజిల్‌లో ఓ బ్యాంకులో నిజంగానే స్పైడర్ మ్యాన్ ప్రత్యక్షమయ్యాడు. 
 
బ్రెజిల్‌లోని ఓ బ్యాంకులో ఓ ఉద్యోగి పని చేస్తున్నాడు. ఆయనకు చివరి పని దినం కావడంతో .. ఈ రోజు తన జీవితంలో గుర్తుండిపోయేలా ప్లాన్ చేశాడు. ఇందుకోస స్పైడర్‌మ్యాన్ వేషధారణలో విధులకు హాజరయ్యాడు. అతన్ని చూసిన సహోదోగ్యులను ఆశ్చర్యంలో మునిగిపోయారు. 
 
సహచరులతో మాట్లాడుతూ, కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తున్న అతడి చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆయన చివరి పనిదినం రోజున ఆయనతో పాటు ఇతర ఉద్యోగులు కూడా బాగా ఎంజాయ్ చేశారు. 
 
దీనికి సంబంధించిన ఓ వీడియోను యూట్యూబ్‌లోనూ పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమం ఇమ్‌గర్‌లో ఆయన ఫొటోలకు 1.2 లక్షల వ్యూస్ రాగా, వీడియోకు 2.4 లక్షల వ్యూస్ వచ్చాయి.