గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (10:35 IST)

మైల బట్టలను ఇరుముడిలో పెట్టుకుని.. శబరిమలకు వచ్చిన రెహానా..

శబరిమల అయ్యప్ప సన్నిధానంలోకి అన్ని వయస్కుల మహిళలను ప్రవేశించవచ్చునని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చిన నేపథ్యంలో.. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కొందరు మహిళలు శబరిమలకు వెళ్లారు. అందులో రెహానా ఒకరు.


శబరిమలలోని అయ్యప్ప సన్నిధానానికి అత్యంత దగ్గరగా వెళ్లి, వెనుదిరిగి వచ్చిన ముస్లిం యువతి రెహానా ఫాతిమాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసిన మరుసటి రోజే ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించినట్లు బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. 
 
రెహానా బీఎస్ఎన్ఎల్‌లో టెలికాం టెక్నీషియన్‌గా పనిచేస్తుండగా.. ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. కాగా సెప్టెంబర్ 30న ఫాతిమా.. తన ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టింది. ఆ ఫేస్‌బుక్ పేజీలో శబరిమలకు వెళ్లిన ఫోటోను పోస్టు చేశారు. నీలక్కల్ వద్ద చేరుకున్న ఆమెను పోలీసులు సన్నిధానం వరకు తీసుకెళ్లగలిగారు. 
 
అయితే భక్తుల నిరసనలతో ఆమె వెనుదిరిగి రాగా, ఆ తర్వాత ఆమె మైల బట్టలు ఇరుముడిలో పెట్టుకుని వచ్చిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె నివాసాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రెహానాను ముస్లింల నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన కూడా విడుదలైంది. తాజాగా ఆమె ఉద్యోగం కూడా ఊడింది.