శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (15:33 IST)

కాలేజీలకు వెళ్తుతున్నారా.. అయితే ఇలా చేయండి..?

కళాశాలకు వెళ్లుతుంటారు. కానీ, కొత్తగా, అందంగా తయారై వెళ్లాలని చాలామంది అమ్మాయిలు అనుకోరు. ఏదో పోతున్నానంటే పోతున్నానంటూ వెళ్తుంటారు.  కొందరమ్మాయిలు ట్రెండీగా ఉండాలని కోరుకుంటారు.. కానీ ఆచరణలో మాత్రం విఫలమవుతుంటారు. ఈ చిన్న చిన్న మార్పులే ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. మరి ఆ మార్పులేంటో తెలుసుకుందాం..
 
సాదా రంగుల్లో గులాబీ, నలుపు, తెలుపు, ముదురు నీలం వంటి టాప్స్‌ను దగ్గర ఉంచుకోవాలి. అలానే నిలువు, అడ్డం గీతలు, ఒక ఫ్లోరల్ టాప్ ఉంచుకోవాలి. అప్పుడే ఏ బాటమ్ మీదికైనా చేసుకోవచ్చు. ఏ సందర్భానికైనా అందంగా కనిపించేలా చేస్తాయి. ఇక డ్రెస్ పై నుండి కింది వరకు ఒకే రంగులో ఉండే విధంగా దుస్తులు వేసుకుంటే అంత అందంగా కనిపించరు. కాబట్టి టాప్, బాటమ్, చున్నీ రంగులు వేర్వేరు రంగులు ఉండేలా ఎంచుకోవాలి. ప్రతిరోజూ కాలేజీకి వెళ్లడానికే వేసుకునే దుస్తులు అంత ఆడంబరంగా ఉండనక్కర్లేదు. సింపుల్‌గా ఉంటే చాలు అదే అందంగా, ఫ్యాషన్ ఉంటుంది. 
 
ఇక జడ విషయానికి వస్తే.. పోనీ, ఫ్రెంచ్ ఫ్లెయిట్, పఫ్ వంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేసి జడలు వేసుకోవాలి. అప్పుడే మీరు చూడడానికి కొత్తగా కనిపిస్తారు. కమ్మలు కూడా చిన్న చిన్న బిందువులా వేలాడే లోలాకులు, సిల్వర్ చాంద్ బాలీలూ, జుంకాలు వంటివి పెట్టుకుంటే బాగుంటుంది. చివరిగా చేతికి పెద్ద డయల్ వాచ్ ఒక్కటి పెట్టుకుంటే స్టైల్‌ అండ్ ఫ్యాషన్‌గా కనిపిస్తారు.