సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (18:41 IST)

అతడు బ్యాంక్ మేనేజర్... ఉద్యోగానికి వెళ్లగానే భార్య ఎవరితోనో అని అనుమానం...

ఈమధ్య కాలంలో... ఫేస్ బుక్, వాట్స్ యాప్ వంటి సాధనాలు వచ్చిన తర్వాత తనే సర్వస్వం అని వచ్చిన భార్యలను అనుమానించడం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ అనుమానాలతో ఎంతో అన్యోన్యంగా వుంటున్న జంటల జీవితాలు నాశనమవుతున్నా

ఈమధ్య కాలంలో... ఫేస్ బుక్, వాట్స్ యాప్ వంటి సాధనాలు వచ్చిన తర్వాత తనే సర్వస్వం అని వచ్చిన భార్యలను అనుమానించడం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ అనుమానాలతో ఎంతో అన్యోన్యంగా వుంటున్న జంటల జీవితాలు నాశనమవుతున్నాయి. కొన్నిసార్లు అవి దారుణాలకు కూడా దారితీస్తున్నాయి. విడాకులను మించి హత్యల వరకూ వెళ్లిపోతున్నాయి. హైదరాబాదులో జరిగిన ఈ ఉదంతం ఇలాంటిదే.
 
వివరాల్లోకి వెళితే... హైదరాబాదుకు చెందిన మాధవ్ మిర్యాలగూడలోని సిండికేట్ బ్యాంకులో మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఇతడికి గత ఏడాది అక్టోబరు నెలలో సుమలత అనే యువతితో వివాహమైంది. ఆరేడు నెలలు కాపురం సజావుగానే సాగింది. ఐతే ఈమధ్య తను ఉద్యోగానికి వెళ్లగానే తన భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తున్నట్లు అనుమానం వచ్చింది. దీనిపై భార్యతో గొడవపడ్డాడు. తనను అనుమానిస్తున్నారంటూ ఆవేదనతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
ఐతే అక్కడ పెద్దలు, తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పి మళ్లీ మాధవ్ ఇంటి వద్ద దిగబెట్టి వెళ్లిపోయారు. కానీ మాధవ్ అనుమానం మాత్రం చావలేదు. భార్యను పదేపదే ప్రశ్నిస్తూ గొడవకు దిగాడు. ఈ క్రమంలో వారిమధ్య ఓ రోజు వాదన తీవ్రస్థాయికి వెళ్లిపోయింది. దానితో కోపోద్రిక్తుడైన మాధవ్ ఆమెను హత్య చేశాడు. వెంటనే తను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగువారు వెళ్లి చూడగా ఇద్దరూ విగతజీవులుగా పడి వున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.