శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 20 జనవరి 2019 (13:40 IST)

నా స్థాయి తగ్గిన రెమ్యునరేషన్ ఇస్తేనే ఓకే చెప్తా : బాలీవుడ్ హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్లల దీపికా పదుకొనే ఒకరు. బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతోంది. భారీ బడ్జెట్ బయోపిక్‌ల మొదలుకుని సెన్సేనల్ సబ్జెక్టుల వరకు ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ ఆమె మాత్రమే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రాజెక్టు కోసం ఆమెను ఓ నిర్మాత సంప్రదించాడట. ఆ చిత్రంలో హీరో కంటే తక్కువ మొత్తంలో రెమ్యునరేషన్‌ ఇస్తానని ఆఫర్ చేశాడట. దీంతో దీపికా పదుకొనే ఆ నిర్మాతపై ఆగ్రహం వ్యక్తంచేసిందట. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నా స్థాయి ఏంటో నాకు తెలుసు. దానికి తగ్గ రెమ్యునరేషన్ కోరుకోవడంలో తప్పేముంది! పైగా ఆయన హీరో కంటే హీరోయిన్ రెమ్యునరేషన్ తక్కువే ఉండాలన్నట్టు మాట్లాడాడు. పాత్రలు సమానమైనప్పుడు, ఇద్దరికీ రెమ్యునరేషన్ కూడా సమానంగా ఉండాలి కదా' అంది. నిజమేగా మరి. అయితే, ఆ నిర్మాత లేదా హీరో పేరు మాత్రం ఆమె వెల్లడించలేదు.