శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (14:49 IST)

వామ్మో.. ఆ హీరోయిన్‌కు అంత రెమ్యునరేషనా?

టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కుందనపు బొమ్మల్లో లావణ్య త్రిపాఠి ఒకరు. ఈమెకు సరైన హిట్స్ లేకపోయినప్పటికీ ఆఫర్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ - డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో నిర్మితమైన చిత్రం "అంతరిక్షం 9000" కేఎంపీహెచ్ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
నిజానికి లావణ్య త్రిపాఠి కెరీర్‌లో పెద్దగా చెప్పుకోదిగిన హిట్స్ లేవు. 'సోగ్గాడే చిన్నినాయనా', 'భలే భలే మగాడివోయ్' అనే చిత్రాలు మినహా మిగిలిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ట్రాక్‌ప‌రంగా ఆమెకు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ రెమ్యునరేషన్ పరంగా మాత్రం ఆమె బాగానే అర్జిస్తున్నట్టు సమాచారం. 
 
అంతరిక్షం చిత్రం కోసం ఆమెకు రూ.40 లక్షల వరకు చెల్లించినట్టు ప్రచారంలో ఉంది. మొదట రూ.80 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేయగా, అంత ఇవ్వలేమని నిర్మాతలు చెప్పారు. దీంతో ఆమెకు కథ నచ్చడంతో నిర్మాతలు ఆఫర్ చేసిన మొత్తాన్ని తీసుకుని సైలెంట్ అయిపోయింది.