శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (10:49 IST)

అగ్ర హీరోగా ఎదిగిన అర్జున్ రెడ్డి.. అంతా గీత గోవిందం ఎఫెక్టే?

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‌కు బాగా కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ.. గీత గోవిందం సినిమాతో అగ్ర హీరోగా ఎదిగిపోయాడు. గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో రిలీజైన అతి కొద్ది రోజుల్లోనే విజయ్ దేవరకొండ ర

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‌కు బాగా కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ.. గీత గోవిందం సినిమాతో అగ్ర హీరోగా ఎదిగిపోయాడు. గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో రిలీజైన అతి కొద్ది రోజుల్లోనే విజయ్ దేవరకొండ రూ.100కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. 
 
రూ.10కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లో తనకున్న భారీ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని విజయ్ తన రెమ్యునరేషన్‌ను పెంచినట్టు సమాచారం. అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సమయంలో తన రెమ్యునరేషన్‌ను పెంచాడు.
 
ప్రస్తుతం గీత గోవిందం సినిమాకు విజయ్ రూ.10కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఈ రెమ్యునరేషన్ తన లాస్ట్ సినిమాతో పోలిస్తే చాలా ఎక్కువని తెలుస్తోంది. ఇకపోతే.. గీత గోవిందం సినిమా థియేట్రికల్ రైట్స్ పరంగానే రూ.50కోట్లు వసూలు చేసింది. ఇవికాకుండా శాటిలైట్ హక్కుల రూపంలో, రీమేక్, డిజిటల్ రైట్స్ రూపంలో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది.