సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (13:14 IST)

ఒక్క బ్లాక్ బస్టర్ హిట్‌తో భారీగా పెంచిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "గీత గోవిందం". ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీవాసు నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "గీత గోవిందం". ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీవాసు నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. 
 
ఈ చిత్రాన్ని కేవలం రూ.10 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. కానీ, ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో ఇప్పటికే రూ.60 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. రూ.100 కోట్ల క్లబ్‌ దిశగా అడుగులు వేస్తోంది. దీన్ని హీరో విజయ్ దేవరకొండ క్యాష్ చేసుకున్నాడు.
 
ప్రస్తుతం ఈ యువ హీరో తన రెమ్యునరేషన్‌ను ఏకంగా రూ.10 కోట్లకు పెంచినట్టు సమాచారం. తన సినిమాలన్నీ మంచి సక్సెస్ సాధిస్తుండటం.. ప్రేక్షకుల్లో తనకున్న భారీ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని విజయ్ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేశాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. గతంలో కూడా 'అర్జున్ రెడ్డి' హిట్ తర్వాత కూడా విజయ్ ఇదేవిధంగా పారితోషికాన్ని పెంచిన విషయం తెల్సిందే.
 
దీనిపై ఫిల్మ్ నగర్ వర్గాలు స్పందిస్తూ, 'ఎప్పుడైతే సినిమాలు మంచి బిజినెస్ చేస్తాయో.. ఆ సమయంలో నటీనటులు రెమ్యునరేషన్ పెంచడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ అనిపించదు. ఆసక్తికర విషయం ఏంటంటే.. 'గీత గోవిందం' సినిమా థియేట్రికల్ రైట్స్‌పరంగానే రూ.50 కోట్లు వసూలు చేసింది. ఇవికాకుండా శాటిలైట్ హక్కుల రూపంలో, రీమేక్, డిజిటల్ రైట్స్ రూపంలో ఈ సినిమా చాలా ప్రాఫిట్స్‌ను రాబట్టిందని' అభిప్రాయపడ్డారు.