శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 25 ఆగస్టు 2018 (17:33 IST)

అర్జున్ రెడ్డి నుంచి.. నర్తనశాల వరకు.. ఆ కామెంట్స్ ఏంటి?

అర్జున్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా యూత్‌కు ఎంత బాగా కనెక్ట్ అయ్యిందో బాగా తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేస

అర్జున్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా యూత్‌కు ఎంత బాగా కనెక్ట్ అయ్యిందో బాగా తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సంగతిని పక్కనబెడితే.. 'అర్జున్ రెడ్డి' సినిమా సమయంలో విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ అవుతుందని తనతో ఎవరైనా బెట్ వేస్తే.. తన అకౌంట్‌లో ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేస్తానని చెప్పాడు. 
 
అప్పట్లో విజయ్ చేసిన అతిపై సోషల్ మీడియాలో విమర్శలొచ్చాయి. కానీ సినిమా హిట్ అవ్వడంతో అందరూ మర్చిపోయారు. ఆ తరువాత ఆరెక్స్ 100 సినిమా హీరో ప్రమోషన్స్‌లో హద్దులు మీరి మాట్లాడాడు. శ్రీనివాస కళ్యాణం సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఇలానే జరిగింది. నితిన్ తన కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఫిలిం అవుతుందంటూ కామెంట్ చేశాడు. కానీ సినిమా ఫట్ కావడంతో కామ్‌గా వుండిపోయాడు. 
 
ఇక తాజాగా నాగశౌర్య వంతు వచ్చింది. అతను నటించిన 'నర్తనశాల' సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని, నచ్చకపోతే అసలు చూడద్దంటున్నాడు. నచ్చితే మాత్రం సినిమా బాగుందని పది మందికి చెప్పి ప్రోత్సహించమని కోరాడు. 
 
హీరోలు స్టేజ్‌ల మీద ఇలాంటి కామెంట్లు చేయడం వివాదాస్పదమవుతోంది. వీరి వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇకనైనా హీరోలు హద్దులు మీరకుండా కంటెంట్ పరంగా సినిమాను ప్రమోట్ చేసుకుంటే బాగుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.