శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (14:23 IST)

''అర్జున్ రెడ్డి'' అంత పెంచేశాడా..?

''పెళ్లి చూపులు'' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్‌గా ఎదిగిపోయాడు. తాజాగా విడుదలైన గీత గోవిందం సినిమాతో అగ్రహీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి, పెళ్

''పెళ్లి చూపులు'' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్‌గా ఎదిగిపోయాడు. తాజాగా విడుదలైన గీత గోవిందం సినిమాతో అగ్రహీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు సినిమాలకు మోస్తరుగా పారితోషికం తీసుకున్న విజయ్ దేవరకొండ.. గీత గోవిందం సినిమా జోష్‌తో ఆరు రెట్లు పెంచేశాడు. 
 
గీత గోవిందం సినిమాకు రూ.50లక్షలు పారితోషికం తీసుకున్న అర్జున్ రెడ్డి.. ప్రస్తుతం నటిస్తున్న నోటా సినిమాకు అక్షరాలా రూ.3కోట్ల రూపాయలు పెంచేశాడట. ఇదే రెమ్యునరేషన్ మొత్తాన్ని తదుపరి సినిమాలకు కొనసాగిస్తున్నట్లు సమాచారం. 
 
అయితే విజయ్ పారితోషికాన్ని పెంచేసినా.. నిర్మాతలు మాత్రం అతనికి వున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో తప్పులేదంటున్నారు. ప్రస్తుతం అతడి చేతిలో అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నట్లు సమాచారం.