బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (18:03 IST)

బిగ్ బాస్-12: సల్మాన్ ఖాన్ 12 రోజులు.. 24 ఎపిసోడ్లు.. రూ.288 కోట్లు?

బిగ్ బాస్ రియాల్టీ షోకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ కల్చర్.. ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకింది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో బిగ్ బాస్ ఫీవర్ యువతను ఊపేస్తోంది. ఇక బాలీవుడ్‌లో అయితే బిగ్ బాస్ షో సీజన్ల మీద సీజన్లు నడుస్తోంది.


ఈ క్రమంలో బాలీవుడ్‌లో కండల వీరుడు, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పటికే 11 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్-12 ప్రారంభం కానుంది. ఈ షోకు కూడా సల్మాన్ ఖానే హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. 
 
ఇక బిగ్ బాస్ 12వ సీజన్‌కు సల్మాన్ ఖాన్ భారీగా పారితోషికం తీసుకున్నారని టాక్ వస్తోంది. మూడు నెలల పాటు ప్రసారం కానున్న ఈ షో కోసం సల్మాన్ మొత్తం 12 రోజులు మాత్రమే షోలో పాల్గొనబోతున్నాడు. ఈ 12 రోజుల్లో మొత్తం 24 ఎపిసోడ్స్‌ను చిత్రీకరించనున్నారు. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.12కోట్లను సల్మాన్ వసూలు చేస్తున్నాడట. ఈ లెక్కన మొత్తం 24 ఎపిసోడ్లకు సల్మాన్‌కు ముట్టనున్న రెమ్యునరేషన్ అక్షరాలా రూ. 288 కోట్లని జోరుగా ప్రచారం సాగుతోంది.