సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (09:36 IST)

'ఆర్ఎక్స్ 100' హీరోకు బంపర్ ఆఫర్.. ఏంటది?

వెండితెరపై అనేక మంది కుర్ర హీరోలు కనిపిస్తున్నారు. అలా ఇటీవలికాలంలో కనిపించిన హీరో కార్తికేయ. "ఆర్ఎక్స్ 100" చిత్రంతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. అతి తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం ఇపుడు నిర్మా

వెండితెరపై అనేక మంది కుర్ర హీరోలు కనిపిస్తున్నారు. అలా ఇటీవలికాలంలో కనిపించిన హీరో కార్తికేయ. "ఆర్ఎక్స్ 100" చిత్రంతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. అతి తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం ఇపుడు నిర్మాతకు, పంపిణీదారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పైగా, ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతితో పాటు హీరో కార్తికేయకు కూడా మంచి పేరు లభించింది.
 
దీంతో కార్తికేయ ఒక్కసారిగా హిట్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఫలితంగా ఆయనకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ కోవలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో 'కబాలి' చిత్రాన్ని నిర్మించిన తమిళ ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. వి క్రియేషన్స్ పతాకంపై నిర్మించే ఈ చిత్రంలో కార్తికేయను హీరోగా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి సూర్య, జ్యోతిక, భూమికలు కలిసి చేసిన 'నువ్వు నేను ప్రేమ' చిత్ర దర్శకుడు టిఎన్ కృష్ణ డైరెక్ట్ చేయనుండటం విశేషం. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో నిర్మితంకానుంది.