శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (18:54 IST)

అప్పుడు అభిమన్యుడు.. ఇప్పుడు చినబాబు సోదరుడు.. రైతులకు కోటి విరాళం

ఊపిరి ఫేమ్ కార్తీ.. రైతుబిడ్డగా ''చినబాబు'' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కార్తి హీరోగా నటించిన చినబాబును తమిళంలో కడైకుట్టిసింగం టైటిల్‌‌తో విడుదల చేశారు. ఈ సినిమాకు కార్తీ సోదరుడు, హీరో సూర్య నిర

ఊపిరి ఫేమ్ కార్తీ.. రైతుబిడ్డగా ''చినబాబు'' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కార్తి హీరోగా నటించిన చినబాబును తమిళంలో కడైకుట్టిసింగం టైటిల్‌‌తో విడుదల చేశారు. ఈ సినిమాకు కార్తీ సోదరుడు, హీరో సూర్య నిర్మాతగా వ్యవహరించాడు. ఈ మూవీ హిట్ కావడంతో తమిళ రైతులకు సూర్య కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి, అన్నదాతల మనసు గెలుచుకున్నాడు. రైతుల ప్రాధాన్యం, కుటుంబ విలువల గొప్పతాన్ని తెలుపుతూ చినబాబు తెరకెక్కింది. 
 
తొలివారంలో ఈ సినిమా తమిళనాడు వ్యాప్తంగా రూ.20 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే మంగళవారం (జూలై-24) చినబాబు విజయోత్సవ వేడుకను నిర్వహించారు. సూర్య, కార్తి, పాండిరాజ్‌, సత్యరాజ్‌ యూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా సూర్య తన నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ తరఫున తమిళనాడు రైతుల సంక్షేమ సంఘం ఆగ్రం ఫౌండేషన్‌‌కు రూ.కోటి విరాళంగా అందించాడు. 
 
ఇటీవల విశాల్ హీరోగా నటించిన అభిమన్యుడు సినిమా హిట్ కావడంతో తెలుగు రైతుల కోసం సాయం అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్య కూడా కోటి రూపాయలను రైతులకు విరాళంగా ఇవ్వడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో చినబాబు సక్సెస్ మీట్ సందర్భంగా కోటి రూపాయలు సూర్య విరాళమిస్తూ తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సూర్య మంచితనాన్ని అభిమానులు, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.