సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (14:18 IST)

కన్నడ హీరో హత్యకు కుట్ర... నిజమా?

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరో హత్యకు కుట్రపన్నారు. ఈ వార్త ఇపుడు కన్నడనాట సంచలనంగా మారింది. కర్ణాటక పోలీసులు అరెస్టు చేసిన ఓ రౌడీ షీటర్ వద్ద జరిపిన విచారణలో ఈ విషయం వెల్లడైంది.

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరో హత్యకు కుట్రపన్నారు. ఈ వార్త ఇపుడు కన్నడనాట సంచలనంగా మారింది. కర్ణాటక పోలీసులు అరెస్టు చేసిన ఓ రౌడీ షీటర్ వద్ద జరిపిన విచారణలో ఈ విషయం వెల్లడైంది. ఆ రౌడీ షీటర్ పేరు సైకిల్ రవి. ఈయన మరో రౌడీ షీటరు కోదండరామ ఈ హత్యకు ప్రధాన సూత్రధారి. అయితే, ఈ రౌడీ షీటర్ చంపాలనుకున్న హీరో పేరును మాత్రం పోలీసులు బహిర్గతం చేయలేదు.
 
ఇకపోతే, కొన్నిరోజుల క్రితం కన్నడ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కూడ హత్యాప్రయత్నం జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ను హత్య చేసినవాళ్లే ప్రకాష్ రాజ్‌ను చంపడానికి ప్రయత్నించినట్లు సమాచారం.