శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: సోమవారం, 27 ఆగస్టు 2018 (20:15 IST)

యూరప్‌‌కు విజయ్ దేవరకొండ... అందుకే వెళ్తున్నాడట...

భారీ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఇక 15 రోజుల పాటు అందుబాటులో ఉండరట. యూరప్‌లో సోలోగా ఎంజాయ్ చేస్తాడట. ఛలో యూరప్ అంటూ విదేశాలకు బయలుదేరుతున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి హిట్ తరువాత నాన్‌స్టాప్‌గా సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉన్న విజయ్ కాస్త సమయం

భారీ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఇక 15 రోజుల పాటు అందుబాటులో ఉండరట. యూరప్‌లో సోలోగా ఎంజాయ్ చేస్తాడట. ఛలో యూరప్ అంటూ విదేశాలకు బయలుదేరుతున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి హిట్ తరువాత నాన్‌స్టాప్‌గా సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉన్న విజయ్ కాస్త సమయం దొరకడంతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. 15 రోజుల పాటు ఎవరితో టచ్‌లో లేకుండా యూరప్‌లో ఫ్లైట్‌లో తిరిగేందుకు వెళ్తున్నాడట. 
 
గీత గోవిందం సినిమాతో భారీ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత టాక్సీవాలాతో పాటు మరో రెండు సినిమా షూటింగ్‌ల్లో బిజీబిజీగా ఉన్నారు. అయితే కొత్తగా సంతకం చేసిన రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్ళేందుకు కాస్త సమయం ఉందట. దీంతో 15 రోజుల పాటు యూరప్ వెళ్ళి ఎంజాయ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చేశాడట. 
 
విజయ్ యూరప్‌కు వెళ్ళేది తన గర్ల్ ఫ్రెండ్‌తో గడిపేందుకేనన్న ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో యూరప్‌కు విజయ్ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాడట. దీంతో ఆ అమ్మాయిని కలిసేందుకే యూరప్‌కు వెళుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఆ అమ్మాయి పేరు, వివరాలను మాత్రం విజయ్ దేవరకొండ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడట. అయితే ఇప్పటికే ఇద్దరి మధ్యా ఫోన్ టచ్ ఉందని, డేటింగ్ కోసమే విజయ్ యూరప్‌కు వెళుతున్నారని హీరోను స్నేహితులు తెగ ఆట పట్టించేస్తున్నారు.