1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Scientists have found underground water lake on Mars

అంగారకుడిపై సరస్సు.. అదీ ఉప్పునీటి సరస్సును కనుగొన్నారట..?

అంగారకుడిపై ద్రవరూపాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తొలిసారిగా అంగారుకునిపై ద్రవరూపంలో నీరున్న భారీ సరస్సును కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మంచుపొర కింద 20కిలో మీటర్ల ప్రాంత పరిధిలో ఇది విస్తర

Scientists
అంగారకుడిపై ద్రవరూపాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తొలిసారిగా అంగారుకునిపై ద్రవరూపంలో నీరున్న భారీ సరస్సును కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మంచుపొర కింద 20కిలో మీటర్ల ప్రాంత పరిధిలో ఇది విస్తరించి వుంది. దీంతో మరింత నీరుతోపాటు అక్కడ జీవమూ ఉండే అవకాశముందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 
 
ప్రస్తుతం అంగారక ఉపరితలం అత్యల్ప ఉష్ణోగ్రతలతో పొడిపొడిగా ఉంది. 360 కోట్ల ఏళ్లక్రితం ఇక్కడ భారీ సరస్సులు ఉండేవనిచెప్పే ఆనవాళ్లు ఇప్పటికే బయటడ్డాయి. ప్రస్తుతం ద్రవరూపంలోని నీటి జాడలను పరిశీలించేందుకు ఇటలీలోని ఇస్టిట్యూటో నేజియోనల్‌ డీ అస్ట్రోఫిజికా సంస్థ నిపుణులు తాజాగా అన్వేషణ చేపట్టారు. 
 
ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన మార్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆర్బిటార్‌‌లోని రాడార్‌ సమాచారాన్ని బట్టి అంగారకునిపై నీరున్న సంగతిని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. మార్సిస్‌‌గా పిలుస్తున్న ఈ రాడార్‌.. భూమిపై గ్రీన్‌‌లాండ్‌, అంటార్కిటికాల్లోని మంచు ఫలకాల కింద నీరును తెలియచేసే తరహా సంకేతాలును పంపింది. దీనిని బట్టి ఇక్కడ సరస్సు వుండేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. గడ్డకట్టిన ఉపరితలానికి 1.5 కి.మీ దిగువన ఇది వుందని శాస్త్రవేత్త రాబర్టో ఒరోసెయ్ తెలిపారు. ఈ నీరు ఉప్పునీరుగా గుర్తించామన్నారు.
About Writer
Selvi
తర్వాతి కథనం
అమ్మో.. చైనా మహిళ మూత్రపిండంలో 3వేల రాళ్లు.. గంటపాటు సర్జరీ చేసి?