సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (17:13 IST)

నవగ్రహాలను తొమ్మిదిసార్లే కాదు.. ఇలా ప్రదక్షణలు చేస్తే..?

నవగ్రహాలను సాధారణంగా తొమ్మిదిసార్లు ప్రదక్షణలు చేస్తారని చాలామందికి తెలుసు. అయితే నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి నిర్ణయించిన సంఖ్యలో ప్రదక్షణ చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఎలాగంటే.. తొలుత 9స

నవగ్రహాలను సాధారణంగా తొమ్మిదిసార్లు ప్రదక్షణలు చేస్తారని చాలామందికి తెలుసు. అయితే నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి నిర్ణయించిన సంఖ్యలో ప్రదక్షణ చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఎలాగంటే.. తొలుత 9సార్లు నవగ్రహాలను ప్రదక్షణ చేశాక.. తొమ్మిది గ్రహాల అనుగ్రహం కోసం వేర్వేరుగా ప్రదక్షణలు చేయాల్సి వుంటుంది. 
 
అలాగే నవగ్రహాలను ప్రదక్షణలు చేయడం మంచిదే. కానీ ఏ ఆలయానికి వెళ్ళినా గర్భగుడిలోని స్వామిని దర్శించుకోకుండా.. నవగ్రహాలను మాత్రమే ప్రదక్షణలు చేయడం మంచిది కాదు. ఇక నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. అందుకే తొలుత సూర్యుని అనుగ్రహం కోసం పది సార్లు ప్రదక్షణలు చేయాలి.
 
ఆపై శుక్ర గ్రహానికి ఆరు సార్లు, చంద్రునికి 11సార్లు, శనిభగవానుడికి 8 సార్లు ప్రదక్షణలు చేయాలి. రాహువు నాలుగు సార్లు, బుధ గ్రహానికి 5, 12, 23 సార్లు ప్రదక్షణలు చేయాలి. ఇక కేతు గ్రహానికి 9 సార్లు, గురుభగవానుడికి 3, 12, 21 సార్లు ప్రదక్షణలు చేయడం ద్వారా ఈతిబాధలుండవు, గ్రహదోషాలుండవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
యోగాలను అందించే నవగ్రహాలు 
సూర్యుడు- ఆరోగ్యం 
చంద్రుడు- కీర్తి 
అంగారకుడు- సిరిసంపదలు 
బుధ గ్రహం- బుద్ధి వికాసం 
గురువు- గౌరవ ప్రతిష్ఠలు 
శుక్రుడు - అందం, ఆకర్షించే సౌందర్యం 
శనీశ్వరుడు- ఆనందమయమైన జీవితం 
రాహు- ధైర్యం 
కేతు- వంశాభివృద్ధి చేకూరుతాయి.