సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (18:50 IST)

శని భగవానుడి చిత్ర పటాన్ని ఇంట్లో వుంచి పూజ చేయొచ్చా?

శని భగవానుడి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజ గదిలో వుంచి పూజించవచ్చా? అనే అనుమానం మీలో వుందా? ఐతే ఈ స్టోరీ చదవండి. శనీశ్వరుని విగ్రహాన్ని లేదా పటాన్ని పూజ గదిలో వుంచకూడదు.. అనడం కంటే శనీశ్వరుడి పటాన్ని ప

శని భగవానుడి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజ గదిలో వుంచి పూజించవచ్చా? అనే అనుమానం మీలో వుందా? ఐతే ఈ స్టోరీ చదవండి. శనీశ్వరుని విగ్రహాన్ని లేదా పటాన్ని పూజ గదిలో వుంచకూడదు.. అనడం కంటే శనీశ్వరుడి పటాన్ని పూజగదిలో వుంచాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఆధ్యాత్మిక పండితులు. శనీశ్వరుడితో పాటు నవగ్రహాలను ఇంట్లో వుంచి పూజించే సంప్రదాయం పురాతన కాలం నుంచే లేదు. 
 
కొన్ని పురాతన ఆలయాల్లో నవగ్రహ విగ్రహాలుండవు. అత్యధికంగా అంటే 200 సంవత్సరాల తర్వాతే నవగ్రహాలను ఆలయాల్లో ప్రతిష్టిస్తున్నారు. వాటికి పూజ చేస్తున్నారు. దేవుడు ఆదేశించే పనులను నిర్వర్తించేందుకే నవగ్రహాలున్నాయి. అలాంటి నవగ్రహాల వల్ల ఏర్పడే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే.. పరమాత్ముడిని పూజించాలే కానీ.. నవగ్రహాలను పూజించడం సరికాదు. 
 
అయినప్పటికీ భక్తుల ఇష్టం మేరకు.. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్టించిన నవగ్రహాలను పూజించడం.. వాటి చుట్టూ ప్రదక్షిణలు చేయడంలో తప్పులేదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఇంకా నవగ్రహాలచే దోషాలు ఏర్పడినప్పుడు అందుకు తగిన శాంతి పరిహారాలు చేయాలి. శాంతి హోమాలు చేయించుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇక శనిభగవానుడు అశుభ గ్రహాలకు అధిపతి. 
 
అలాంటప్పుడు శనిభగవానుడి ప్రతిమ లేదా పటాన్ని ఇంట్లో వుంచి పూజించాల్సిన అవసరం లేదు. శని మాత్రమే కాకుండా శుభగ్రహాలైన నవగ్రహాలను కూడా ఆలయంలో వరకే పూజకు పరిమితం చేయాలి. ఇంట్లో నవగ్రహ పూజ మంచిది కాదు. కాదు కూడదు.

ఇంట్లో నవగ్రహాలను వుంచి పూజ చేయాలనుకుంటే ఆగమ శాస్త్రం ప్రకారం హోమాలు చేశాకే.. దీపారాధన చేసి దీపజ్యోతిలో నవగ్రహాలను ఆవాహన చేసుకుని... పూజించుకోవచ్చు. కానీ నవగ్రహ పటాలు, విగ్రహాలు ఇంట్లో వుంచి పూజించడం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.