మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (13:02 IST)

ఘనంగా అమ్రపాలి వివాహం... వరంగల్ కలెక్టరేట్‌లో విందు (వీడియో)

వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ అప్రపాలి, జమ్మూకశ్మీర్ ఐపీఎస్ అధికారి సమీర్ శర్మల వివాహం ఆదివారం అంగరంగవైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు వరంగల్ మున్సిపల్ కమిషనర్ శ్రుతి ఓజా,

వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ అప్రపాలి, జమ్మూకశ్మీర్ ఐపీఎస్ అధికారి సమీర్ శర్మల వివాహం ఆదివారం అంగరంగవైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు వరంగల్ మున్సిపల్ కమిషనర్ శ్రుతి ఓజా, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కలపల్లి రవీందర్‌రావు, వరంగల్ కలెక్టరేట్ సిబ్బంది హాజరయ్యారు. 
 
ఈ నూతన దంపతులు ఈనెల 21వ తేదీ వరకు జమ్మూకాశ్మీర్‌లోనే ఉండి, 22వ తేదీన హైదరాబాద్‌కు వస్తారు. 23న వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ప్రముఖులకు వివాహ విందు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోనూ విందు కార్యక్రమం ఖరారైంది. ఈ నెల 26 నుంచి మార్చి 7 వరకు ఈ నూతన దంపతులు టర్కీలో పర్యటించనున్నారు.