మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (12:08 IST)

కుల్దీప్ సైగలు ఏం చెప్తున్నాయి..

మొన్నటికి మొన్న ప్రియా వారియర్ సైగలు సోషల్ మీడియాలో హిట్ అయితే.. ప్రస్తుతం టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ సైగలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ కుల్దీప్ ఏం చేశాడంటే..? దక్షిణాఫ్రికాతో జరిగి

మొన్నటికి మొన్న ప్రియా వారియర్ సైగలు సోషల్ మీడియాలో హిట్ అయితే.. ప్రస్తుతం టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ సైగలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ కుల్దీప్ ఏం చేశాడంటే..? దక్షిణాఫ్రికాతో జరిగిన తొలవి మ్యాచ్‌కు గాయం కారణంగా కుల్దీప్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయినా.. మైదానం బయట కూర్తుని కుల్దీప్ చేసిన కొన్ని సైగలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 
 
భారత్‌ విజయం ఖాయమన్న సందర్భంలో కెమెరామెన్ డగౌట్‌లో వున్న కుల్దీప్‌ను పదే పదే చూపించాడు. దీన్ని గమనించిన కుల్దీప్ ఫన్నీగా చేతులతో సైగలు చేశాడు. అదే సయమంలో దక్షిణాఫ్రికా డగౌట్‌లో షమ్సీ ఉన్నాడు. 
 
దీంతో ఈ సైగలపై సోషల్‌ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ సైగలు ఓడిపోతున్న దక్షిణాఫ్రికాను, షమ్సీని చూపించండి అంటూ.. చెప్పే విధంగా అతని సైగలు వున్నాయని కొందరు అంటున్నారు. వికెట్ కోల్పోయిందని షమ్సీ బ్యాటింగ్ వెళ్తాడు చూడండి అన్నట్లు కూడా కుల్దీప్ సైగలున్నాయని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.