ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 30 ఆగస్టు 2018 (16:56 IST)

నువ్వు హీరో ఏంట్రా... ఆ క్యారెక్టర్‌కు కూడా సరిపోవన్నారు : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు. కానీ ఒకప్పుడు విజయ్ అంటే నువ్వు ఎవరు... అనేవారు. అంతేకాదు నువ్వు హీరో ఏంట్రా అంటూ హేళనగా మాట్లాడేవారు కొంతమంది నాతో. వారి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఎవరికైనా ఒక అవకాశం వస్తే కదా వానిలోని టాలెంట్ ఏంటో తెల

విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు. కానీ ఒకప్పుడు విజయ్ అంటే నువ్వు ఎవరు... అనేవారు. అంతేకాదు నువ్వు హీరో ఏంట్రా అంటూ హేళనగా మాట్లాడేవారు కొంతమంది నాతో. వారి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఎవరికైనా ఒక అవకాశం వస్తే కదా వానిలోని టాలెంట్ ఏంటో తెలుస్తుంది అంటున్నారు విజయ్. 
 
అవకాశాల కోసం కొంతమంది దగ్గరకు వెళితే నన్ను హీనంగా మాట్లాడారు. సైడ్ క్యారెక్టర్‌కు కూడా నన్ను సరిపోవని హేళన చేశారు. అప్పుడు చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు వారందరూ నన్ను చూసి తలదించుకుంటున్నారు. ఇప్పుడు పిలిచి అవకాశం ఇస్తామంటున్నారు. నువ్వే మా హీరో అంటూ ప్రాధేయపడుతున్నారు. ఈ సంతోషం నాకు చాలు అంటున్నారు విజయ్.