శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:59 IST)

ఆసక్తి రేపుతోన్న 'అభినేత్రి 2' ఫస్టులుక్

ప్రభుదేవా, తమన్నా జంటగా ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో 2016వ సంవత్సరంలో 'అభినేత్రి' చిత్రం తెరకెక్కింది. తమిళ, హిందీ భాషలతో పాటు తెలుగులోనూ ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్‌గా 'అభినేత్రి 2' సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.
 
ప్రధాన పాత్రధారులైన ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేతలపై ఆవిష్కరించిన ఫస్టులుక్ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. 'అభినేత్రి'లో తమన్నా పల్లెటూరి అమ్మాయిగానూ.. మోడ్రన్ అమ్మాయిగానూ డిఫరెంట్ లుక్స్‌తో కనిపించి మెప్పించేసిన విషయం తెలిసిందే. 
 
'అభినేత్రి 2' మాత్రం ప్రభుదేవా డిఫరెంట్ లుక్స్‌తో కనిపించనున్నట్టు చెప్తున్నారు. ఇక నందితా శ్వేత పాత్ర ప్రధాన ఆకర్షణ అవుతుందనే చెప్పాలి. దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ సీక్వెల్‌తోనూ హిట్ కొడతాడనే టాక్ కోలీవుడ్‌లో బలంగానే వినిపిస్తోంది.