సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 25 మే 2019 (13:06 IST)

అభినేత్రి 2 ట్రైలర్ వచ్చేసింది.. (వీడియో)

కేఎల్ విజయ్, ప్రభుదేవా, తమన్నాల కాంబోలో అభినేత్రి సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. అభినేత్రి సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. 
 
అభినేత్రిలో తమన్నాకు దెయ్యం పట్టినట్లు చూపెడితే.. ఈ సినిమాలో ప్రభుదేవాను రెండు దెయ్యాలు పట్టుకున్నట్లు చూపిస్తున్నారు. కోవై సరళ కామెడీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఇక మరింత కామెడీ డోస్ పెంచేందుకు సప్తగిరి ఈ చిత్రంలో వున్నాడు. ఇంకేముంది.. అభినేత్రి 2 ట్రైలర్ ఎలా వుందో చూద్దాం..