గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 2 మే 2019 (10:57 IST)

''మహర్షి'' కొత్త రికార్డ్.. ఏంటది..? (వీడియో)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం ‘మహర్షి’. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ''మహర్షి'' ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్‌లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ ట్రైలర్ ప్రస్తుతం కొత్త రికార్డును సృష్టించింది. మే 1వ తేదీన రాత్రి 9 గంటల వ్యవధిలో ఇది విడుదల కాగా, ఇప్పటివరకూ ఈ ట్రైలర్ దాదాపు రెండున్నర మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 
 
ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో 'మహర్షి' ట్రైలర్ ఉంది. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
 
ఈ ట్రైలర్‌లో మహేష్ డైలాగ్స్ అదిరిపోయాయి. అల్లరి నరేష్, మహేష్ మధ్య వచ్చిన సంభాషణలు సినిమాలో వినోదానికి కొదవ లేదని చెప్పకనే చెప్పాయి. జగపతిబాబుతో మహేష్ చెప్పిన డైలాగ్, అనంతరం ట్రైలర్‌లో కనిపించిన ఫైట్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. మొత్తం మీద ‘మహర్షి’ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. 
 
ఇప్పటికే విడుదలైన ‘మహర్షి’ ఆడియోకు మంచి స్పందన వచ్చింది. దేవీశ్రీప్రసాద్ అందించిన బాణీలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ‘మహర్షి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 9న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.