సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 1 మే 2019 (14:23 IST)

షాకింగ్ - మ‌హేష్ మూవీ నుంచి దిల్ రాజు ఔట్... ఏమైంది?

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం మ‌హ‌ర్షి. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జ‌రుపుక‌నే ఈ సినిమా మే 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. 
 
ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ సినిమాని అనిల్ సుంక‌ర‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించ‌నున్నారు అని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. త్వ‌ర‌లోనే అఫిషియల్‌గా ఈ మూవీ గురించి ఎనౌన్స్ చేయాల‌నుకుంటున్నారు. అయితే... ఈ మూవీ నుంచి దిల్ రాజు త‌ప్పుకున్నారు అని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌హ‌ర్షి సినిమాకి ముగ్గురు నిర్మాత‌లు. అందువ‌ల‌న ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. 
 
ఈ అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకుని మ‌హేష్ బాబు... త‌దుప‌రి చిత్రానికి ఇద్ద‌రు నిర్మాత‌లు కాకుండా ఒక్క‌రే ఉండాలని చెప్పారో.. ఏమో కానీ... మ‌హేష్ - అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి దిల్ రాజు త‌ప్పుకున్నారు అని టాక్ వినిపిస్తోంది. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌లపై దిల్ రాజు క్లారిటీ ఇస్తారేమో.