మహేష్ బాబుకి 'మే' నెల ఫీవర్... టెన్షన్ - రంగంలోకి దిగిన నమ్రత..!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ రిలీజ్‌కి రెడీ అయ్యింది. మే 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి నాలుగు గంటల నిడివి వస్తే... దానిని దాదాపుగా మూడు గంటల లోపు తీసుకువచ్చారు. ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ కాపీ చూసుకుని మహేష్, దిల్ రాజు హ్యాపీగా ఫీలయ్యారు. సక్సస్ పైన పూర్తి నమ్మకంతో ఉన్నారని వార్తలు వస్తున్నా... మహేష్ బాబుకి లోపల మాత్రం టెన్షన్‌గానే ఉందట.
అందుకనే నమ్రత రంగంలోకి దిగి సినిమా పబ్లిసిటీ అంతా చూసుకుంటున్నారట. ఇంతకుముందు ఎన్నడూ చేయని విధంగా ప్రచారం చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేసారట. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో తిరిగే రైళ్లకు మహర్షి పోస్టర్స్ అంటించి విస్త్రృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదంతా నమ్రత ప్లాన్ అట.
అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ఈ ప్రమోషన్‌ను మరింత పెంచుతారట. మే నెలలో రిలీజ్ చేసిన మహేష్ సినిమాలు నిజం, నాని, బ్రహ్మోత్సవం అట్టర్ ప్లాప్ అయ్యాయి. అందుకే మహేష్ బాగా టెన్షన్ పడుతున్నాడట. నమ్రత ప్లాన్ వర్కవుట్ అయి ఈ సినిమా సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తుందో లేదో..!