మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (18:15 IST)

మహర్షి తలపాగా చుట్టి.. నాగలి పట్టి పొలం దున్నుతూ.. పదరా.. పదరా..? (video)

సూపర్ స్టార్ మహేష్ బాబు ''మహర్షి'' సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ప్రస్తుతం ప్రమోషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రైతు పాటను విడుదల చేశారు.


నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి చిత్రాలతో మహేష్‌కి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్.. ''మహర్షి'' చిత్రానికి మరోసారి పనిచేస్తున్నారు. 
 
భారీ బడ్జెట్‌తో మహర్షి సినిమా నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మే 1వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించి, 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'పదరా.. పదరా.. పదరా.. నీ అడుగుకి పదునుపెట్టి పదరా' అనే ఒక సాంగును విడుదల చేశారు.
 
ఈ పాటలో తలపాగా చుట్టి.. నాగలిపట్టి పొలం దున్నుతూ మహేశ్ బాబు ఈ వీడియోలో కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శ్రీమణి సాహిత్యం,శంకర్ మహదేవన్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఇంతకుముందు వదిలిన మూడు పాటల తరహాలో ఈ పాట ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన నాయికగా పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. ఈ పాట లిరికల్ సాంగ్ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.