శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (11:17 IST)

''మహర్షి'' కాలేజ్ సాంగ్ వచ్చేసింది.. లిరికల్ అదిరిపోయింది.. (వీడియో)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో మహర్షి సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సిమా నుంచి తొలి లిరికల్ సాంగ్ విడుదలైంది. చోటి.. చోటి అంటూ సాగే ఈ పాట లిరిక్స్ అదిరిపోయింది. కళాశాల నేపథ్యం, స్నేహంలోని గొప్పతనాన్ని ఈ పాటలో ఆవిష్కరించారు. మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్‌లపై ఈ పాట సాగేలా వుంది. 
 
మహర్షి సినిమా మే 9వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. 'స్నేహం అంటే పుస్తకాలు చెప్పని పాఠం .. కన్నవాళ్లు ఇవ్వలేని ఆస్తి' అంటూ శ్రీమణి రాసిన సాహిత్యం బాగుంది. దేవీ శ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం అదరగొట్టేసింది. యూత్‌ను బాగా ఆకట్టుకునేలా వుంది. చాలారోజుల తరువాత కాలేజ్ స్టూడెంట్స్‌కి తగిన పాటకు సంగీతం సమకూర్చాడు. ఇంకేముంది.. మహర్షి నుంచి వచ్చిన లిరికల్ సాంగ్‌ను మీరూ ఓ లుక్కేయండి.