గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (16:15 IST)

మహేశ్ బాబుకి ఈసారి కూడా సైకిల్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా??

టాలీవుడ్‌లో టాప్ హీరోలలో ఒకరైన మహేశ్ బాబు వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. సినిమాలో తన పాత్ర చాలా విభిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. గతేడాది భరత్ అనే నేను చిత్రంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల వర్షం కురిపించాడు. తన స్టామీనా ఏమిటో మరోసారి నిరూపించాడు. తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వేసవి కానుకగా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇదిలా ఉంటే మహేశ్ బాబుని ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. అదే సైకిల్ సెంటిమెంట్. అదేమిటి సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ గుర్తు కదా..మరి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నాడని అనుకుంటున్నారా? తన బావ గల్లా జయదేవ్ తరపున ప్రచారం చేయనున్నాడా అని ఆలోచిస్తున్నారా? దానికి వేరే కథ ఉందని మీకు తెలుసా?
 
గతంలో మహేశ్ బాబు నటించిన చిత్రాల్లో సైకిల్‌ని తొక్కుతూ కనబడిన సన్నివేశాలతో ఆ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. అందులో ముందుగా చెప్పాలంటే 2015లో వచ్చిన శ్రీమంతుడు. ఈ చిత్రంలో మహేశ్ చాలా వరకు సైకిల్ తొక్కుతూ కనబడే సన్నివేశాలు మనల్ని బాగా అలరించాయి. ఇప్పుడు మహేశ్ ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ మరోసారి తన తాజా చిత్రం మహర్షిలో సైతం సైకిల్‌పై షికారు చేయనున్నాడట. 
 
ఈ చిత్రానికి సంబంధించి ఈరోజు విడుదలైన పోస్టర్‌లో సైకిళ్లు ఉండడం మీరు కూడా గమనించవచ్చు. మరి ఈ సైకిల్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయిందంటే మహేశ్ ఖాతాలో మరోసారి బ్లాక్‌బస్టర్ పడ్డట్టే అని ఫిల్మ్‌నగర్‌లో బాగా వినిపిస్తున్న టాక్.