శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (15:48 IST)

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నైట్ ఫ్రీగా ఉంటావా? అని అడిగేవారు : కరాటే కళ్యాణి

తెలుగు చిత్ర పరిశ్రమలో కరాటే కళ్యాణి అంటే తెలియనివారుండరు. కృష్ణ సినిమా 'అబ్బ.. బాబీ' అనే డైలాగుతో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఆమెకు అనేక ఆఫర్లు వచ్చాయి. ఫలితంగా వందలాది చిత్రాల్లో నటించారు. 
 
ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆమె కార్యనిర్వాహకణ కమిటీ సభ్యురాలిగా ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కెరీర్ మొదట్లో తాను కూడా ఇలా కాస్టింగ్ కౌచ్‌తో ఇబ్బందులు పడినట్టు చెప్పారు. 'నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నైట్ ఫ్రీగా ఉంటావా? బయటకు వెళదామా అని అడిగేవారు' అని అడిగేవారని చెప్పారు. 
 
'కేవలం సరదాకే కదా అని వెళ్లేదాన్ని. కానీ వారు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించేవారు. అలాంటి పనులని నేను ఎంకరేజ్ చేయను. నా కెరీర్ మొదట్లో ఓ వ్యక్తి నా వద్దకు వచ్చి నెలకు రూ.50 వేలు జీతం ఇస్తాను, నేను ఏది చెబితే అది చేయాలి, దానికోసం బాండ్ రాయమన్నాడు. నేను కుదరదని చెప్పాను. తన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపొమ్మన్నాడు. ఆ తర్వాత వేరే ఇంటికి మారిపోయాను. అప్పుడు ఒప్పుకుని ఉంటే ఇప్పుడు మీకు ఈ విషయం చెప్పే అవకాశమే వచ్చేది కాదు' అని గతాని కరాటే కళ్యాణి ఓసారి గుర్తుకు తెచ్చుకుంది.