యాక్షన్ బోర్ కొడుతోందంటున్న ప్రభాస్
ప్రభాస్ వరసగా యాక్షన్ సినిమాలు సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి రెండు భాగాలు భారీ యాక్షన్ సన్నివేసాలతో తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలు అద్భుతమైన విజయం సంగతి తెలిసిందే. ఈ రెండింటి తరువాత మరో భారీ యాక్షన్ సినిమా 'సాహో' చేస్తున్నారు. ఇండియన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాతో పాటు ప్రభాస్ జాన్ అనే మరో సినిమా చేస్తున్నాడు.
జాన్ సినిమా జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీనే అయినా కూడా ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు సినిమాలో భారీ యాక్షన్ సన్నివేసాలు ఉండాలని ప్లాన్ చేశారట. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్‌కు యాక్షన్‌పై బోర్ కొట్టినట్టుంది. జాన్ సినిమాలో అద్భుతమైన లవ్ స్టోరీ ఉంది కాబట్టి.. సినిమాలో యాక్షన్ పార్ట్ తగ్గించమని దర్శకుడికి సూచించాడట ప్రభాస్.