గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (14:06 IST)

సాహో రైట్స్.. ఎంతో తెలిస్తే మతిపోతుంది.. ప్రభాస్ క్రేజంటే అదే మరి?

బాహుబలితో ఇంటర్నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు ప్రభాస్, అభిమానుల సంఖ్య కూడా భారీగా పెరిగిన నేపథ్యంలో తర్వాత విడుదల కాబోయే ప్రభాస్ సినిమాలపై ఆసక్తి నెలకొంది. ఏ మాత్రం స్థాయి తగ్గకుండా సాహో చిత్రం మొదలైంది. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 
 
ఇప్పటికే టీజర్ విడుదలై అంచనాలను భారీగా పెంచేసింది. ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం యూవీ క్రియేషన్స్ సంస్థ సుమారుగా 150 కోట్ల బడ్జెట్‌ను వెచ్చిస్తోంది.
 
తాజాగ సాహో సినిమాకు సంబంధించిన ఓవర్సీస్‌ రైట్స్‌ భారీ రేటుకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. ఫార్ ఫిల్మ్స్ అనే సంస్థ సుమారుగా రూ.40 కోట్లు ఖర్చు పెట్టి ఈ హక్కులను చేజిక్కించుకుందని తెలుస్తోంది. 
 
అయితే చైనా మినహా మిగతా దేశాలలో ఈ సినిమాను ప్రదర్శించే హక్కులను ఈ సంస్థ పొందినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హిందీ హక్కులను టీ సిరీస్‌కు చెందిన భూషణ్ కుమార్ రూ.120 కోట్లకు దక్కించుకున్నారనే టాక్ వచ్చిన విషయం తెలిసిందే.